© 2026 nimisham.in

Specila Sahasra Kalasabhishekam on June 24: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రేపు, ఎల్లుండి వీకెండ్ కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శ్రీవారి పంచబేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవ రాణి ప్రతిష్టించిన సందర్భాన్ని పురస్కరించుకొని, జూన్ 24వ తేదీన ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. జూన్ 24న ఈ అద్భుత ఘట్టం తిరుమలలో జరగనుంది. శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో గరుడాల్వార్ సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని, శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేస్తారు. ముఖ్యంగా శ్రీవారి పంచబేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని శ్రీవారి ఆలయంలో పల్లవ రాణి సామవై కొన్ని వందల ఏళ్ల క్రితం ప్రతిష్టించిన రోజును పురస్కరించుకొని జూన్ 24న ఈ ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, శ్రీవారి మూలమూర్తి ముందు గరుడాళ్వార్ సన్నిధిలో కొలువై ఉన్న శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి, శ్రీ విశ్వక్సేనుల వారి ఆశీస్సులు అందుకునేలా కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తర్వాత మూలమూర్తిని, శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని దారంతో కట్టి అనుసంధానం చేస్తారు. ఈ అద్భుత ఘట్టం ఈ నెల జూన్ 24న జరగనుంది. వేద పండితుల వేద పారాయణంతో, అర్చక స్వాములు ఈ ప్రత్యేక సహస్ర కలశాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనూ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయి. తిరుమలలో ప్రతిరోజూ వివిధ రూపాల్లో విరాళాలు అందుతూనే ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కూడా గురువారం టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆపన్నహస్త పథకానికి కోటి రూపాయల విరాళం అందించింది. సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఈ విరాళం చెక్కును అందజేశారు
.