
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. ఆదివారం నాడు ఏకంగా 97,014 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 37,108 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.93 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది.టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే 4.61 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 4.22 లక్షల మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో మొత్తం 3,757 మంది శ్రీవారి వైద్య సేవను అందుకున్నారు. రద్దీ నేపథ్యంలో క్యూ కాంప్లెక్సులు, క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కాగా.. సెప్టెంబర్ లో ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని, స్వామివారి ఆలయం, పరిసరాల ఆధునీకరణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇందులో భాగంగా తిరుమలలోని అత్యంత పవిత్రమైన శ్రీవారి పుష్కరిణి మరమ్మతు పనులను టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.నా రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉన్నా, వెనక్కి తీసుకోను: తేల్చి చెప్పిన బీజేపీ అధికార ప్రతినిధిఈ తనిఖీ సందర్భంగా శ్రీవారి పుష్కరిణి వద్ద చేపట్టాల్సిన భద్రతాపరమైన మార్పులపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేదా ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులు ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతాల్లోకి వెళ్లకుండా నిరోధించేందుకు తగిన రక్షణ గ్రిల్స్‌ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని స్పష్టం