
పత్రికా సమావేశాల్లో కునుకులోకి జారే యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్‌నకు షాకిచ్చి నిద్రలేపే ‘జాపర్’గా ఓ యువతి పేరు ట్రెండ్ అవుతుండటంతో ఆమె తాజా స్పందించి వివరణ ఇచ్చారు. ఇష్టారీతిన ట్రోలింగ్‌కు దిగే వారికి ఇంగిత జ్ఞానం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అభిమానించే వారు ఆయనపై ఈగను కూడా వాలనివ్వరు. ఇక ట్రంప్‌ను వ్యతిరేకించే వారు ఆయనను టార్గెట్ చేసే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోరు. కుదిరితే ఓ రేంజ్లో ట్రోలింగ్‌కు దిగుతారు. ఇలాంటి సందర్భాల్లో ఒక్కోసారి ట్రంప్‌నకు మద్దతిచ్చే వారు కూడా చిక్కుల్లో పడుతుంటారు. ప్రస్తుతం జేమీ లీగ్ ఫ్రాంక్లిన్ అనే యువతి కూడా ఇలాంటి స్థితిలో కూరుకుపోయారు. పత్రికా సమావేశాల్లో కునుకులోకి జారే ట్రంప్‌నకు షాకిచ్చి నిద్రలేపే ‘ది జాపర్’గా ఆమె పేరు ట్రెండ్ అవుతోంది. ది కన్జర్వేటర్ అనే మీడియా సంస్థకు జేమీ లీగ్ ఫ్రాంక్లిన్ సీఈఓగా ఉన్నారు. గతంలో ట్రంప్ సహాయకబృందంలో ఆమె కొంతకాలం పనిచేశారు. ఇటీవల చిన్నారుల టీకా కార్యక్రమానికి సంబంధించి నూతన మార్గదర్శకాలను ట్రంప్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జేమీ కూడా పాల్గొన్నారు. ట్రంప్ విలేకరులతో మాట్లాడుతుండగా ఆమె ఆయన పక్కనే నిలబడ్డారు. ఆ సమయంలో ఆమె తన ఉదరంపై చేయి వేసుకుని కనిపించారు. అయితే, ఈ సమావేశంలో ట్రంప్ పలుమార్లు నిద్రలోకి జారీ మళ్లీ మెళకువ తెచ్చుకున్న వైనం కెమెరా కంటికి చిక్కింది. ఓ సందర్భంలో ట్రంప్ ఇలాగే అకస్మాత్తుగా కునుకులోకి జారిపోయారు. ఈ క్రమంలో ఆయన పక్కనే ఉన్న జేమీ తన ఉదరంపై వేళ్లు కదిపారు. యాదృచ్ఛికంగా అదే క్షణంలో ట్రంప్‌కు కూడా మెళకువ వచ్చింది. ఈ దృశ్యాలన్నీ వీడియోలో రికార్డు కావడంతో ట్రంప్ విమర్శకులకు గోల్డెన్ ఛాన్స్ దక్కినట్టై రెచ్చిపోయారు. ట్రంప్ కునుకులోకి జారినప్పుడు ఎవరికీ తెలియకుండా చిన్ని చిన్ని విద్యుత్ షాకులిచ్చి నిద్రలేపేందుకే జేమీ అక్కడ ఉన్నారని ఓ సరదా