© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై సైనిక దాడులు కొనసాగిస్తోన్న అమెరికా.. ఇప్పుడు ఆ దేశ ఆర్థిక జీవనాధారంపై దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది. టెహ్రాన్‌ను ఏకాకిని చేయడమే లక్ష్యంగా మరో కొత్త ఎత్తుగడతో (US-Iran War) రంగంలోకి దిగింది. ఇరాన్‌కు సాయం చేసే దేశాలు ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు. మరి ఈ బెదిరింపుల ప్రభావం భారత్‌పై ఏ మేర ఉంటుంది..? ఇరాన్‌తో మన వాణిజ్యం ఎలా ఉంది..? ఏ దేశంపైనా ఇప్పటివరకు చేపట్టని అత్యంత తీవ్రమైన ఆర్థిక చర్యను తాను ఈ రోజు ఇరాన్ (Iran)పై ప్రకటిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ‘‘ఒప్పందం విషయంలో ఇరాన్‌కు నేనిచ్చినంత గొప్ప అవకాశం ఎవరూ ఇవ్వలేదు. కానీ, డీల్ చేసుకోవడంలో వారు విఫలమయ్యారు. అందుకే, ఈ రోజు నేను ఆ దేశంపై ఆర్థిక యుద్ధం ప్రకటిస్తున్నా. ఇరాన్‌ను ఒంటరిని చేయడమే మా లక్ష్యం. ఇప్పటికే ఆ దేశ నౌకాదళం నాశనమైంది, వాయుసేన ధ్వంసమైంది. సైనిక కర్మాగారాలు శిథిలమయ్యాయి. వారి కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఇక, ఇప్పుడు వారికి ఆర్థికంగానూ ఇబ్బందులు తప్పవు. ఏ దేశమైనా తమ ఆర్థిక సంస్థలు, వ్యాపారాలు, విమానాశ్రయాలు, ప్రభుత్వ సంస్థల ద్వారా ఇరాన్‌కు జీవనాధారాన్ని అందిస్తే గనుక.. ఆ దేశం తీవ్రమైన ఆర్థిక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చమురు స్మగ్లింగ్, నగదు బదిలీలు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లు, షిప్ రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీలు.. ఇవన్నీ ఇప్పుడే ఆగిపోవాలి. అవన్ని ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. ఇరాన్ ముప్పును ఎదుర్కోడానికి, దాన్ని ఏకాకిని చేసి, ఓడించడానికి అమెరికా మిత్రదేశాలన్నీ మాతో కలిసి నిలబడాలి. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండకూడదు’’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు. ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు సాగించే దేశాలన్నింటికీ ట్రంప్ ఈ హెచ్చరికలు చేశారు. టెహ్రాన్‌కు భారత్ కీలకమైన వాణిజ్య భాగస్వామిగా (India-Iran Trade) ఉంది. ఇరాన్‌తో మనది మిగులు
వాణిజ్యం. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇటీవలి కాలంలో ఈ వ్యాపార లావాదేవీలు కాస్త తగ్గినప్పటికీ.. ట్రంప్ తన హెచ్చరికలకు అనుగుణంగా చర్యలు చేపడితే, బారత ఎగుమతిదారులకు కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు.
ఈ రెండు దేశాల మధ్య ఉన్నది కేవలం చమురు బంధం మాత్రమే కాదు. భారత్ నుంచి బాస్మతీ బియ్యం, తేయాకు, చక్కెర, తాజా పళ్లు, ఔషధాలు, మసాలాలు, ఆహార సంబంధిత పదార్థాలు ఇరాన్ మార్కెట్‌కు ఎగుమతి అవుతుంటాయి. ఇక, టెహ్రాన్ నుంచి పిస్తా, ఖర్జూరాలు, యాపిల్స్, కివీ వంటి వాటిని మన దేశం దిగుమతి చేసుకుంటోంది. ఒకవేళ ట్రంప్ ఆర్థిక చర్యలు చేపడితే గనుక.. మన దేశ ఫార్మా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దారులపై ప్రభావం పడే అవకాశం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.