ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియా ఘర్షణలు, బెదిరింపుల నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ నేతలు శత్రువులకు చిక్కకుండా కొత్తమార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శత్రువులకు దొరక్కుండా ఒక చిన్న విమానంలో ప్రయాణించారట (Trump Secret Flight). పటిష్ట భద్రతకు నెలవైన ఎయిర్‌ఫోర్స్ వన్ను వదిలి.. యూఎస్ మిలిటరీకి చెందిన చిన్న విమానాన్ని వాడారు. ఇటీవల తుర్కియేలో జరిగిన నాటో సదస్సు అనంతరం ఆ దేశాన్ని వీడేటప్పుడు ఈ రహస్య ఫ్లైట్‌ను ఎంచుకున్నారని అమెరికా మీడియా కథనం వెల్లడించింది. జులైలో తుర్కియే రాజధాని అంకారాలో నాటో సదస్సు జరిగింది. ఖతార్ కానుకగా ఇచ్చిన బోయింగ్ 747-8లో అంకారాకు ట్రంప్ (Donald Trump) వెళ్లారు. కానీ వచ్చేటప్పుడు మాత్రం దానిని వాడలేదు. ఎయిర్‌ఫోర్స్ వన్ ఎక్కారు. ప్రపంచం మొత్తానికి అదే చూపించారు. కానీ అక్కడే సీన్ మారింది.. తర్వాత విమానం బెల్లీ నుంచి బయటకు తెచ్చి.. అక్కడే సిద్ధంగా ఉన్న ఎయిర్పోర్ట్ క్యాటరింగ్ ట్రక్కు (గ్రౌండ్ సపోర్ట్ వెహికిల్)లోకి ట్రంప్‌ను మార్చారు. ఆ తర్వాత ఆయన్ను C-32A విమానంలోకి ఎక్కించి రహస్యంగా తుర్కియే దాటించారు. అక్కడి నుంచి బ్రిటన్ వెళ్లారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో పాత్రికేయులు, ఇతర సిబ్బంది ప్రయాణించారు. ట్రంప్ ఆ విమానంలోనే ఉన్నారని శత్రువులను నమ్మించేందుకు, ఆయన భద్రత దృష్ట్యా ఈ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. జులై 8న ఈ ఘటన జరిగిందని మీడియా కథనం పేర్కొంది. అప్పటికే ఇరాన్-అమెరికా (Iran-USA) మధ్య ఘర్షణలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. అదీగాక తుర్కియేకు అత్యంత సమీపంలో ఇరాన్ ఉంటుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత