
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆ దేశంతో జరుగుతోన్న చర్చలపై తమకు నమ్మకం లేదని.. వారు ఎప్పుడూ తనకు అబద్ధాలే చెబుతారని అన్నారు. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)పై సంపూర్ణ నియంత్రణ అమెరికాకే ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం జలసంధి తమ అధీనంలోనే ఉందన్నారు. ఈసారి చర్చల నుంచి వెనక్కి తగ్గినా.. దుందుడుకు చర్యలకు పాల్పడినా కఠిన ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హర్మూజ్ జలసంధి (Hormuz)లో ఒమన్ వద్ద ఓ నౌకపై అమెరికా దాడి చేసింది. ఇరాన్ రేవులపై తమ దిగ్బంధనాన్ని ఉల్లంఘించడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. పనామా జెండా కలిగిన ‘వేలా నోవా’ కార్గో నౌకపై నేవీ హెలికాప్టర్ రెండు హెల్ఫైర్ క్షిపణులను ప్రయోగించిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. ఈ దాడిలో సిబ్బంది ఎవరైనా గాయపడ్డారా అనే విషయాన్ని వెల్లడించలేదు. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో పనామా కాల్వ (Panama Canal)లో నౌకల రద్దీ పెరిగినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో ఎల్‌నినో ప్రభావం వల్ల కాలువలో నీటి మట్టం తగ్గుతున్నట్లు పేర్కొన్నాయి. దీంతో దానిగుండా ప్రయాణించే ఒక్కో వాణిజ్య నౌక నుంచి పనామా కాలువ అథారిటీ 4 మిలియన్ డాలర్లు వసూలు చేస్తున్నట్లు తెలిపాయి. ఓ భారీ నౌక పనామా దాటాలంటే 10 రోజుల వెయిటింగ్ పిరియడ్ ఉన్నట్లు తెలుస్తోంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు