
Trisha Krishnan:నటి త్రిష కృష్ణన్ తాజాగా చేసిన ఓ క్రిప్టిక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. “ఈ వయసులోనూ డ్రామా చేయడం సిగ్గుచేటు” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇటీవల తలెత్తిన వివాదానికి సంబంధించి చేసినవేనంటూ చర్చ జరుగుతోంది. అయితే త్రిష తన పోస్టులో ఎవరి పేరును నేరుగా ప్రస్తావించలేదు. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. కొంతకాలంగా ఆమెకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత అంశాలు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకు త్రిష నేరుగా స్పందించలేదు. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన కొన్ని పోస్టులు మాత్రం అభిమానులు, నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులపై ఆమె పరోక్షంగా స్పందించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. త్రిష తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఆసక్తికరమైన సందేశాన్ని పంచుకున్నారు. ఈ వయసులోనూ అనవసరమైన డ్రామాలు ఎదుర్కోవాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందనే భావన కలిగించేలా ఆ పోస్ట్ ఉంది. అదే సమయంలో డబ్బు సంపాదించుకుని ప్రశాంతంగా జీవించడం మంచిదనే అర్థం వచ్చేలా ఆమె సందేశం ఉండటంతో నెటిజన్లు దీనిని ప్రత్యేకంగా గమనించారు. ఈ పోస్టుకు త్రిష రియాక్షన్ ఎమోజీని జత చేయడం కూడా చర్చకు కారణమైంది. అదే సమయంలో మరో ఇన్స్టాగ్రామ్ స్టోరీని కూడా త్రిష షేర్ చేశారు. తాను గతంలో కోరుకున్న జీవితాన్ని ప్రస్తుతం అనుభవిస్తున్నాననే భావన వ్యక్తమయ్యేలా ఆ పోస్ట్ ఉంది. దానికి ఈవిల్ ఐ ఎమోజీని జత చేశారు. ఈ రెండు పోస్టులు వరుసగా రావడంతో.. ఆమె తన జీవితంలో జరుగుతున్న పరిణామాలపై ఇలా పరోక్షంగా స్పందిస్తున్నారా? అనే చర్చ మొదలైంది. కొంతకాలంగా త్రిష పేరు ఓ వివాదంలో వినిపిస్తోంది. కావేరీ నీటి సమస్యకు సంబంధించిన ఓ కార్యక్రమంలో రాజకీయ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చినట్లు వార్తలు