
యుటిలిటీ సర్వీస్ కాల్స్ కోసం ట్రాయ్ కొత్త 1601 సిరీస్ ఈ కొత్త సిరీస్ను 90 రోజుల్లోగా అమలుకు గడువు విధింపు నకిలీ నంబర్ల నుంచి ఫేక్ కాల్స్ నియంత్రణకు ట్రాయ్ నిర్ణయం TRAI New Rules : వినియోగదారులకు బిగ్ అలర్ట్.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. యుటిలిటీస్ లాజిస్టిక్స్ వంటి ఎమర్జెన్సీ సర్వీసుల కోసం ట్రాయ్ కొత్త నంబర్ సిరీస్ను ప్రకటించింది. ఈ సిరీస్ 1601తో మొదలవుతుంది. గతంలో, బ్యాంకింగ్ ఆర్థిక సేవల కోసం ట్రాయ్ 1600 నంబర్ సిరీస్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మోసపూరిత, ఫేక్ కాల్స్ నుంచి ప్రజలను ప్రొటెక్ట్ చేసేందుకు ఈ కొత్త నంబర్ సిరీస్ను జారీ చేసింది. ముఖ్యంగా యుటిలిటీ సర్వీసులు, కొరియర్ సర్వీసులు, ఫుడ్ డెలివరీ సర్వీసుల కోసం కంపెనీలు ఇకపై ఈ కొత్త నంబర్ సిరీస్ను తప్పనిసరిగా వినియోగించాల్సి ఉంటుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త నిబంధనలలో 1601 నంబర్ సిరీస్ను ప్రవేశపెట్టింది. మొదటి దశలో యుటిలిటీస్, కొరియర్ లాజిస్టిక్స్ రంగాలకు ఈ నెంబర్ జారీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ సిరీస్ను మధ్యవర్తులు, అగ్రిగేటర్లకు కాకుండా ప్రత్యేకంగా నేరుగా డిజిటల్ సంస్థలకు మాత్రమే కేటాయిస్తారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఈ నంబర్లను జారీ చేసే ముందు ఈ డిజిటల్ సంస్థలను వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త రూల్ ఎందుకంటే? : కొరియర్ ఫుడ్ డెలివరీ వంటి మోసపూరిత ఆన్లైన్ సర్వీసులను నిరోధించి వినియోగదారులు ఈజీగా గుర్తించేందుకు వీలుగా టెలికాం నియంత్రణ సంస్థ ఈ కొత్త నంబర్ సిరీస్ను ప్రకటించింది. ప్రారంభంలో యుటిలిటీస్, లాజిస్టిక్స్ కొరియర్ సర్వీసులు ఉంటాయని ట్రాయ్ ఉత్తర్వులో పేర్కొంది. Read Also : Redmi Note 17 Sale : ఖతర్నాక్ ఫోన్ భయ్యా.. కొత్త రెడ్మి నోట్ 17పై స్పెషల్ డిస్కౌంట్.. ధర జస్ట్