కొబ్బరి తురుములో పాలు వేసి కొబ్బరి లడ్డూలను చేసుకోవచ్చు. పండుగ సమయంలో ఈజీగా చేసుకుని తినొచ్చు. బూందీ లడ్డూలు ఇంట్లో సులువుగా చేసుకోవచ్చు. శనగపిండితో బూందీ చేసి, పాకంలో కలిపి లడ్డూలు చుడితే సరిపోతుంది. శనగపప్పుతో బొబ్బట్లు చేసుకోవచ్చు. బెల్లంతో పూర్ణం చేసి, వత్తుకుని కాల్చుకోవాలి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. బియ్యం పిండి, బెల్లం పాకంతో అరిసెలు చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయ పిండి వంటకం ఇది. మెత్తగా ఉండే గులాబ్ జాములను చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. పండుగలో, కుటుంబ వేడుకల్లో పక్కన ఉండాల్సిన స్వీట్ ఇది. బెల్లం, పాలు, బియ్యం, యాలకుల పొడి కలిపి పాయసం చేసుకోవచ్చు. దేవుడికి నైవేద్యంగా పెట్టొచ్చు. బాగుంటుంది. మైదా లేదా గోధుమ పిండితో కజ్జికాయలు చేసుకోవచ్చు. కొబ్బరి, బెల్లం, నువ్వులతో టేస్ట్ చాలా బాగుంటుంది. తాజా క్యారెట్లను తురిమి క్యారెట్ హల్వా చేసుకోవచ్చు. తక్కువ టైంలోనే టేస్టీ స్వీట్ రెడీ అయిపోతుంది. రవ్వ, చక్కెర, పాలతో కేసరి ఈజీగా చేసుకోవచ్చు. పూజలు, పండుగల టైంలో బాగుంటుంది. సులువుగా అయిపోతుంది
.