
టయోటా కొత్త బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది.. SUV కొనాలనుకునేవాళ్లకు ఇదే జాక్‌పాట్ టయోటా బ్లాక్ ఎడిషన్ కారు ధర ఎంతంటే? సెల్ఫ్-ఛార్జింగ్ టెక్నాలజీ స్పెషల్ అట్రాక్షన్ Toyota Hyryder Aero Black : టయోటా మిడ్‌సైజ్ ఎస్యూవీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో సరికొత్త వేరియంట్ వచ్చేసింది. ఈ కంపెనీ ఏరో బ్లాక్ ఎడిషన్ అనే లిమిటెడ్-ఎడిషన్ స్టైలింగ్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. ఈ స్టైలింగ్ ప్యాకేజీ మిడ్నైట్ బ్లాక్ G, V వేరియంట్లతో వస్తుంది. ఏరో బ్లాక్ ఎడిషన్ ప్యాకేజీ నియో డ్రైవ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్ట్రెయిన్లతో లభిస్తుంది. ఈ ప్యాకేజీకి అదనపు రుసుము (Toyota Hyryder Aero Black) కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఏరో బ్లాక్ ఎడిషన్ ప్యాకేజీ ధర రూ. 31,999కు లభిస్తుంది. ఈ ప్యాకేజీలో అనేక ఎక్స్‌ట్రనల్ ఫీచర్లు ఉంటాయి. ఈ ప్యాకేజీలో స్పెషాలిటీ ఏంటి? : హైరైడర్ కోసం ఈ ప్యాకేజీలో ఫ్రంట్ గ్రిల్ అప్పర్ గార్నిష్, ఫ్రంట్ స్పాయిలర్, హెడ్ల్యాంప్లపై బ్లాక్ గార్నిష్, టెయిల్‌గేట్ గార్నిష్ రియర్ స్పాయిలర్‌తో సహా బ్లాక్-థీమ్ ఎక్స్‌ట్రనల్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీకి ప్రత్యేకమైన ఏరో బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ బ్యాడ్జ్ కూడా లభిస్తుంది. Read Also : PM E-Drive Scheme : బయ్యర్లకు బ్యాడ్ న్యూస్! ఈ-స్కూటర్ల సబ్సిడీ సగానికి కోత.. స్కీమ్ 2028 వరకు పొడిగింపు! ఈ స్టైలింగ్ ప్యాకేజీ లిమిటెడ్ టైమ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ స్టాక్ అయిపోతే తిరిగి పొందలేరు. అందుకు బదులుగా టయోటా డీలర్-లెవల్ ఆల్ బ్లాక్ ప్యాకేజీని కొనేసుకోవచ్చు. ఈ కారు ధరలు రూ. 11.31 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. కాగా, హైబ్రిడ్ వెర్షన్ ధర రూ. 17.18 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇంజిన్, మైలేజ్ ఫీచర్లు : ఈ కారు సెల్ఫ్-ఛార్జింగ్ హైబ్రిడ్ నియోడ్రైవ్ అనే 2 పవర్ట్రెయిన్లలో వస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ లీటరుకు 27.97