
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు సూర్యతో నిర్మాత నాగవంశీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. సూర్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీతో సూర్యలో మరోసారి సంజయ్ రామస్వామిని గుర్తుకు తెస్తామని ప్రకటించారు. ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని అన్నారు. మదర్ సెంటిమెంట్ ఈ మూవీలో మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సినిమా చూశాక మీ మదర్‌ను పదిరెట్లు ఎక్కువగా ప్రేమిస్తారని అన్నారు. రాధిక క్యారెక్టర్ చూస్తే అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూస్తారని అన్నారు. ఈ సినిమా త్రివిక్రమ్‌కు కూడా నచ్చిందని వెల్లడించారు. ఆయన మెచ్చుకున్న ఏ సినిమా నాది ఫెయిల్ అవ్వలేదని పేర్కొన్నారు. హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు) ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు) ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు) కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్ ఒక్క ఉద్యోగం లేని టెసారా కంపెనీలో కోట్ల డబ్బు ఎలా..? భారతి సిమెంట్స్ వద్ద హై టెన్షన్.. TDP గూండాల బీభత్సం YS జగన్ కర్నూల్ పర్యటన షెడ్యూల్ ఇదే... పోలీసులకు మా విజ్ఞప్తి ఏంటంటే..?