ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జెన్‌జీ దే హవా కొనసాగుతోంది. ట్రెండ్ దగ్గరి నుంచి రాజకీయాలు, ప్రభుత్వాలను గద్దె దించేవరకు.. జెన్‌జీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో జెన్‌జీ ఏం చేసినా అది వార్తగానే మారుతోంది. ఈ నేపథ్యంలోనే యువత ఎక్కడ నివసించాలనుకుంటోంది.. ఉద్యోగం, కెరీర్‌తో పాటు ఎంజాయ్మెంట్, కొత్త అనుభవాలు, మంచి ఫుడ్, నైట్‌లైఫ్, కల్చర్.. ఇవన్నీ ఒకే నగరంలో దొరికితే ఎలా ఉంటుంది. ప్రస్తుతం Gen Zలో ఇదే అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా యువతకు అత్యంత ఇష్టమైన నగరాలపై నిర్వహించిన తాజా సర్వే ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడించింది.ప్రతి ఏడాది ప్రపంచంలోని ప్రముఖ నగరాలపై ర్యాంకింగ్స్ విడుదల చేసే Time Out.. ఈసారి 30 ఏళ్లలోపు వేలాది మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది. వారు నివసిస్తున్న నగరాల్లో జీవితం ఎలా ఉంది.. అక్కడ ఖర్చులు, ఎంటర్టైన్మెంట్, సంస్కృతి, సామాజిక జీవనం ఎలా ఉన్నాయి.. ఆ నగరాలు యువతకు ఎంతవరకు నచ్చుతున్నాయి.. అనే అంశాలపై వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. ఈ సర్వేలో గతేడాది నంబర్ వన్‌గా నిలిచిన బ్యాంకాక్‌ను వెనక్కి నెట్టి టోక్యో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.టోక్యో, జపాన్జపాన్ రాజధాని టోక్యో ఈసారి Gen Z ఫేవరెట్ సిటీగా నిలిచింది. పురాతన సంప్రదాయాలకు ఆధునిక లైఫ్‌స్టైల్‌ను జోడించిన ఈ టోక్యో నగరం యువతకు అనేక రకాల అనుభవాలను అందిస్తోంది. కలర్‌ఫుల్ షాపింగ్ ప్రాంతాలు, రద్దీగా ఉండే వీధులు, ఆలయాలు, పార్కులతో పాటు ఫ్యాషన్, మ్యూజిక్, యానిమే, గేమింగ్ వంటి యువతను ఆకట్టుకునే క్రియేటివ్ కల్చర్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. కొత్తదనం కోసం వెతికే వారికి టోక్యోలో ప్రతి అడుగులోనూ ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది.పోర్టో, పోర్చుగల్జెన్జీ ఫేవరెట్ సిటీల్లో రెండో స్థానంలో పోర్చుగల్‌లోని పోర్టో నిలిచింది. వేగంగా పరుగులు పెట్టే మెట్రో నగర జీవితానికి భిన్నంగా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. చారిత్రక కట్టడాలు, నదీ తీరాలు, పార్కులు