పశ్చిమ బెంగాల్లో మరోసారి తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌ను ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హలిశహర్‌లో నిరసనకారులు అడ్డుకున్నారు. పోలీసు కస్టడీలో మృతి చెందిన టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆమె అక్కడికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిరసనకారులు మమతా బెనర్జీ వాహనాన్ని చుట్టుముట్టి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత వాహనంపై బురద, రాళ్లు, చెప్పులు వంటి వస్తువులు విసిరినట్లు మమతా బెనర్జీ ఆరోపించారు.పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మమతా బెనర్జీ కాన్వాయ్‌ను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. ఈ ఘటనతో హలిశహర్‌లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన వాహనంపై పెద్ద రాళ్లు విసిరారని మమతా బెనర్జీ ఆరోపించారు. కారు అద్దాలు తెరిచి ఉంటే తీవ్రంగా గాయపడే అవకాశం ఉండేదని ఆమె వ్యాఖ్యానించారు. తన పర్యటన గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ తగిన భద్రత కల్పించలేదని ఆరోపించారు.ఈ ఘటన వెనుక కుట్ర ఉందని దీదీ అనుమానం వ్యక్తం చేశారు. బెంగాల్లో శాంతిభద్రతల పరిస్థితిపై కూడా మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. ఇక.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని రాళ్లు విసరడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఈ దాడిని హత్యాయత్నంగా పరిగణించాలని ఆయన డిమాండ్ చేశారు.మాకేం సంబంధం లేదు.. ఖండించిన బీజేపీమమతా బెనర్జీ కాన్వాయ్‌పై జరిగిన దాడిపై బీజేపీ స్పందించింది. ఈ ఘటనను ఖండిస్తూ.. రాళ్లు, బురద, చెప్పులు విసరడాన్ని తమ పార్టీ సమర్థించదని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య తెలిపారు. ఇలాంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. బీజేపీ నేత, మంత్రి అగ్నిమిత్ర పాల్ కూడా ఈ దాడిని ఖండించారు. రాజకీయ