© 2026 nimisham.in

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో ఎక్కువ మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.. ప్రస్తుతం సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక రూ.300 దర్శనానికి 5 గంటల వరకు సమయం పడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూనే ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం ఇక్కడ క్యూ లైన్లలో వేచి చూస్తుంటారు. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది, కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలా తోరణం వెలుపల వరకు భక్తులు వేచి ఉన్నారు. వీకెండ్ అంటే శని, ఆదివారాల్లో భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. వరుస సెలవుల కారణంగా శ్రీవారి దర్శనానికి భారీగా చేరుతున్నారు. వైకుంఠంలోని కంపార్ట్మెంట్ల క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పట్టగా, టైమ్ స్లాట్ దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి ఐదు గంటల వరకు సమయం పడుతుంది. ఒక్కరోజే 90,546 మంది శ్రీవారిని దర్శించుకోగా, అందులో 36,333 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే రూ.3.93 కోట్ల హుండీ ఆదాయం లభించిందని టిటిడి తెలిపింది. ఇదిలా ఉండగా, జూలై 17న శ్రీవారి ఆలయంలో అనివార ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జూలై 14 కూడా నిర్వహిస్తారు. ఈ రెండు రోజుల్లో VIP బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నారు, అయితే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహాయింపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జూలై 13 నుండి 16 తేదీల వరకు VIP బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను (Recommendation Letters) స్వీకరించరు. జూలై 17న కళ్యాణోత్సవం, ఊంజాల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను కూడా రద్దు చేస్తున్నారు. భక్తులు ఈ విషయాన్ని ముందుగా
తెలుసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.