
Tirumala: తిరుమలలో నకిలీ ఆధార్లతో రూమ్స్ దళారీల అరెస్ట్ తిరుమల: తిరుమలలో భక్తులకు కేటాయించే గదులను నకిలీ ఆధార్ కార్డులు, మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అక్రమంగా పొందుతూ అధిక ధరలకు విక్రయిస్తున్న రూమ్ దళారీల ముఠాను తిరుమల II టౌన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సంయుక్తంగా అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ, ఐపీఎస్ ఆదేశాల మేరకు తిరుమలలో రూమ్ దళారీల అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం తిరుమల CRO కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా గదులు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురిని పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు ముఠాగా ఏర్పడి నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి, వాటిలో ఫొటోలను మార్ఫింగ్ చేసి టీటీడీ CROలో గదులు పొందుతున్నట్లు గుర్తించారు. అనంతరం ఆ గదులను గదులు లభించని భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తానికి విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అలాగే తిరుమల PAC-5 వద్ద ఛార్జింగ్‌కు ఉంచిన భక్తుల సెల్ఫోన్లను దొంగతనం చేసినట్లు కూడా నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో *బి. శ్రీనివాస్ (46), ఇరప్ప కాలప్ప (43), విష్ణు వర్ధన్ (33), అమూల్ కుమార్ సింగ్ (27), ఎస్. ప్రకాష్ (39), పి. సందీప్ (20)*లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గది బుకింగ్‌లు, నకిలీ గుర్తింపు పత్రాల తయారీకి ఉపయోగించిన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 6న PAC-5 వద్ద చోరీకి గురైన రెండు సెల్ఫోన్లను కూడా పోలీసులు రికవరీ చేశారు. నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తిరుమలలో గదులను టీటీడీ అధికారిక కౌంటర్లు, అధికారిక ఆన్లైన్ విధానాల ద్వారా మాత్రమే పొందాలని పోలీసులు