© 2026 nimisham.in

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Tirumala News Today: కొన్ని రోజులుగా తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది, ముఖ్యంగా వీకెండ్ రాగానే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. వీరికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి బివిఎల్ఎన్ చక్రవర్తి, తెలంగాణ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్యే ఈశ్వర్ రావు, ప్రముఖ హాస్య నటుడు బాబు మోహన్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం పెద్ది రంగనాయకుల మంటపంలో ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వాచనం అందించగా, టీటీడీ అధికారులు శ్రీవారి ప్రసాదాలు, శేష వస్త్రాలతో ప్రముఖులను సత్కరించారు. తిరుమల విరాళాల వివరాలు... మరోవైపు, శ్రీవారి భక్తులు విరాళాలను కూడా అందిస్తున్నారు. నిన్న సోమవారం నాడు మొత్తం రూ.41 లక్షలు విరాళాలు అందాయి. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ లయన్ సాయి వెంకట్, టీటీడీ వెంకటేశ్వర సర్వ శ్రేయస్ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం అందించారు. 'జైహో రామానుజ' సినిమా ఆగస్టు 15న విడుదల సందర్భంగా కూడా రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. గుంటూరుకు చెందిన లావణ్య శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణదాత ట్రస్టుకు రూ.11,11,111 రూపాయలు అందగా, రాజమహేంద్రవరంకు చెందిన పాటం శెట్టి ఫణీంద్ర అన్నదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. మొత్తం మీద నిన్న టీటీడీకి రూ. 41 లక్షల విరాళాలు అందాయి. దాతలు తమ విరాళాలను తిరుమలలోని అదనపు క్యాంపు కార్యాలయాల్లో శ్రీసీహెచ్ వెంకయ్య చౌదరి వద్ద జమ చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వైకుంఠ
క్యూ కాంప్లెక్షన్స్లో భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటలు, ఎస్ఎస్డీ (SSD) దర్శనానికి 10 గంటలు, రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో కేవలం ఒక్క రోజే నిన్న 81,692 మంది శ్రీవారిని దర్శించుకోగా, అందులో 35,361 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే టిటిడికి రూ.4.72 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ తెలిపింది.
భక్తుల సౌకర్యార్థం తిరుమలలో సర్వదర్శనం, SSD స్లాట్ దర్శన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ దర్శనం కోసం నిర్దిష్ట సమయాల్లో టికెట్లు జారీ చేస్తారు, ఆ సమయంలో భక్తులు టికెట్లు తీసుకోవచ్చు. అలాగే, రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు మూడు నెలల ముందే జారీ చేస్తారు. దీనితో పాటు రూ.10,000 చెల్లించి కూడా శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది.
మరోవైపు, జూలై 17వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహించనున్నారు. ఆ సాయంత్రం శ్రీవారి పుష్ప పల్లకిపై విహరిస్తారు. ఆణివార ఆస్థానం కారణంగా జూలై 17న కల్యాణోత్సవం, ఆర్థిక బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ వంటి సేవలను టీటీడీ రద్దు చేసింది. అయితే, సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి అత్యంత శోభాయమానంగా అలంకరించబడిన పుష్ప పల్లకిపై వీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.