
Tiruchanur: తిరుచానూరు పంచాయతీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు! Tiruchanur: తిరుచానూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర ఉత్సవ వేడుకలు విశేషంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారిని స్మరించుకున్నారు. ఆ తర్వాత జాతీయ పతాకాన్ని ఎగురవేసి జండా వందనం చేశారు. ఈ నేపథ్యంలో తిరుచానూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి దయాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎందరో మహానుభావులు జాతి మత కుల భేదాలు లేకుండా ఐక్యమత్యంగా పోరాడితేనే మనకు స్వాతంత్రం లభించిందని అన్నారు. వారు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత కలిగి ఉండాలని సూచించారు. తిరుచానూరు గ్రామ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తిరుచానూరు పంచాయతీ కార్యదర్శి దయాకర్, సచివాలయ సిబ్బంది, పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
.