© 2026 nimisham.in

పూణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ (26)ను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో సరికొత్త కోణం వెలుగుచూసింది. ఈ ఘాతుకానికి దాదాపు మూడు వారాల ముందే, అంటే మే 25న ప్రధాన నిందితురాలు సియా గోయల్ (20) తన స్నేహితురాలితో జరిపినట్లుగా చెబుతున్న స్నాప్‌చాట్ సంభాషణ ఇప్పుడు బయటపడి ఈ దర్యాప్తును మలుపు తిప్పింది.వివాహ వేడుకకు విమాన టికెట్లు బుక్ చేయాలనే నెపంతో సియా తన స్నేహితురాలిని గుర్తింపు కార్డు వివరాలు అడిగింది. "టికెట్ల బుకింగ్ కోసమే.. ఎలాగూ ఆ పెళ్లి జరగదు, అయినా సరే వివరాలు పంపించు" అంటూ సియా హిందీలో పంపిన సందేశం ఇప్పుడు దర్యాప్తు అధికారుల చేతికి చిక్కింది. నవంబర్‌లో ఉదయ్‌పూర్‌లో జరగాల్సిన ఈ విలాసవంతమైన వివాహం కోసం అప్పటికే రెండు ప్రత్యేక విమానాలను కూడా బుక్ చేశారు. అయితే జూన్ 18న కేతన్ అనుమానాస్పద స్థితిలో లోహగఢ్ కోటపై నుంచి లోయలోకి పడి మృతి చెందడంతో ఈ వివాహం కాస్తా ఘోర విషాదంగా మారింది. అయితే, పోలీసుల దృష్టిని మళ్లించేందుకు, తానేదో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు నమ్మించేందుకే సియా ఈ విమాన టికెట్ల డ్రామా ఆడిందా అనే కోణంలో పోలీసులు డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ కుట్ర గురించి సదరు స్నేహితురాలికి ముందే తెలుసా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు. కానీ, కేతన్‌ను చంపే ప్లాన్ గురించి తెలిసిన సియా ప్రియుడు చేతన్ చౌదరి (22) క్లాస్మేట్ అయిన మూడో వ్యక్తిని పోలీసులు గుర్తించారు.మరోవైపు, నిందితులు సియా