
– మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్న కార్మికులను 100 శాతం అన్‌ఫిట్ చేయాలి – టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన – కార్మిక కుటుంబాల భవిష్యత్‌తో చెలగాటమాడొద్దు : కాపు కృష్ణ రుద్రంపూర్, సెప్టెంబర్ 01 : సింగరేణిలో అనారోగ్యంతో బాధపడుతూ మెడికల్ బోర్డు కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) డిమాండ్ చేసింది. ప్రతి నెల క్రమం తప్పకుండా కనీసం మూడు మెడికల్ బోర్డులను నిర్వహించి, మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన కార్మికులందరికీ న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఉద్యోగులు టీబీజీకేఎస్ నాయకుడు గడప రాజయ్య ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సుదీర్ఘకాలంగా మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తున్న కార్మికుల ఆవేదనను యాజమాన్యం, ప్రభుత్వం గుర్తించాలని, వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబాల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తక్షణమే మెడికల్ బోర్డుల నిర్వహణను క్రమబద్ధీకరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ మాట్లాడుతూ.. సింగరేణిలో 1998లో రద్దు చేసిన డిపెండెంట్ ఉద్యోగాల స్థానంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కారుణ్య నియామకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ విధానం ద్వారా వేలాది కార్మిక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. కారుణ్య నియామకాల అమలులో భాగంగా 14 వేల మందికి పైగా కార్మికులు మెడికల్ ఇన్‌వ్యాలిడేట్ కావడం ద్వారా వారి కుటుంబాల్లోని అర్హులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడటంతో అనేక కుటుంబాలకు న్యాయం జరిగిందని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికుల్లో 80 శాతానికి పైగా అన్‌ఫిట్ అవుతున్నారని, నెలకు రెండు మెడికల్ బోర్డులు మాత్రమే నిర్వహిస్తున్నారని అప్పట్లో కాంగ్రెస్ పార్టీతో పాటు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలు