
ఇంటర్నెట్ డెస్క్: లిబియా(Libya)లో 65 మంది స్కైడైవర్లు జాతీయ జెండాలతో చేసిన సాహస విన్యాసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో(Guinness World) చోటు దక్కించుకుంది. వీరిలో ముగ్గురు భారతీయులు ఉండటం విశేషం. కేరళలోని కన్నూర్‌కు చెందిన జంషీర్ థనలోట్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన అభిషేక్ రావత్, బిహార్‌లోని పట్నాకు చెందిన ఇషా రాజ్ ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు. యూఏఈలో నివసిస్తున్న వీరు ఆగస్టు 7న లిబియాలో ఈ సాహసం చేశారు. 13 వేల అడుగుల ఎత్తులో సైనిక విమానం నుంచి 65 మంది ఒకేసారి దూకారు. ప్రతి ఒక్కరూ తమ తమ దేశ జెండాలను వెంట తీసుకెళ్లారు. సుమారు 38 దేశాలకు చెందిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకే విమానం నుంచి జాతీయ జెండాలతో అత్యధిక మంది స్కైడైవర్లు (skydivers) ఒకేసారి దూకిన రికార్డుగా ఇది నమోదైంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తాజాగా దీనిని అధికారికంగా ధ్రువీకరించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.