
ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి తొలిరోజే భక్తులు భారీగా తరలివచ్చారు. గవర్నర్ దంపతులు తొలిపూజతో ఉత్సవాలను ప్రారంభించగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు. సాయంత్రం 6 గంటల వరకు 75 వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో గణనాథుడు కొలువుదీరాడు. ఐదు ముఖాలతో పాటు సోమనాథ జ్యోతిర్లింగం, కాళికామాత విగ్రహాలను ఏర్పాటు చేశారు. కాగా, ఈ నెల 25న నిమజ్జనం జరగనుంది.
Found this helpful?
Share this story with your network