© 2026 nimisham.in

మీరు సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియోకు వేలల్లో లైక్‌లు వచ్చాయి. వందలాది మంది ప్రశంసిస్తున్నారు. కానీ అందులో ఒక నెగెటివ్ కామెంట్ మాత్రం మీ దృష్టిని పూర్తిగా ఆకర్షించింది. దానికి వెంటనే సమాధానం ఇవ్వాలా? డిలీట్ చేయాలా? లేక సైలెంట్‌గా వదిలేయాలా? ఇలాంటి పరిస్థితి సోషల్ మీడియాకే పరిమితం కాదు. జీవితంలో చాలా నిర్ణయాలు ఇలాగే క్షణిక భావోద్వేగాల ప్రభావంలో తీసుకుంటాం. తర్వాత మాత్రం ‘‘అలా చేసి ఉండకపోతే బాగుండేది’’ అని బాధపడతాం. అలాంటి పొరపాట్లను తగ్గించడానికి ఒక సులభమైన ఆలోచనా విధానం ఉంది. అదే ‘10-10-10 రూల్’.మూడు ప్రశ్నలుఈ విధానాన్ని ప్రముఖ రచయిత్రి, న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుజీ వెల్చ్ రూపొందించారు. ఇందులో ఎలాంటి క్లిష్టమైన సూత్రాలు ఉండవు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీకు మీరే మూడు ప్రశ్నలు వేసుకుంటే చాలు.ఈ నిర్ణయం 10 నిమిషాల తర్వాత నాకు ఎలా అనిపిస్తుంది?10 నెలల తర్వాత దీని ప్రభావం ఎలా ఉంటుంది?10 ఏళ్ల తర్వాత కూడా ఈ నిర్ణయానికి అంతే ప్రాధాన్యం ఉంటుందా?ఈ మూడు ప్రశ్నలు మన భావోద్వేగాలను, వాస్తవ పరిస్థితులను వేర్వేరుగా చూసేలా చేస్తాయి.ఆవేశమా లేక జీవితాంతం గుర్తుండే నిర్ణయమా?మనం కోపంలో, బాధలో లేదా ఆనందంలో తీసుకునే నిర్ణయాలు చాలా సార్లు తప్పుగా మారుతాయి. ఉదాహరణకు కోపంతో ఉద్యోగానికి రాజీనామా చేయడం, సోషల్ మీడియాలో ఎదుటివారిపై తీవ్రంగా స్పందించడం, లేదా సంబంధాన్ని ఒక్కసారిగా ముగించేయడం. ఆ క్షణంలో అవే సరైన నిర్ణయాల్లా అనిపించినా, కొన్ని నెలల తర్వాత వాటి వల్ల ఇబ్బందులు