పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. చేతబడి భయంతో చోరీ చేసిన సొమ్మును దొంగలు తిరిగి ఇవ్వడం చర్చనీయాంశమైంది. గత నెల 30న నరసరావుపేట ప్రకాష్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఆదినారాయణరెడ్డి ఇంట్లో 317 గ్రాముల బంగారం, రూ.25 లక్షలు చోరీ అయ్యాయి. ఆదినారాయణరెడ్డి ఇంటి తలుపులు వేసినవి వేసినట్లే ఉన్నాయి.. కానీ బీరువా తాళాలు తీసి డబ్బు, బంగారంతోపాటు తాళం కూడా తీసుకెళ్లారు. ఈ దొంగతనం వ్యవహారం ఆలస్యంగా బయటపడింది.. ఇంతలో ఊహించని విధంగా ఆదినారాయణ రెడ్డి ఇంటి చెప్పుల స్టాండ్‌లో డబ్బులు బయటపడ్డాయి.. రూ.19 లక్షల బ్యాగ్‌తో పాటుగా ఒక లేఖ కూడా దొరికింది.ఆదినారాయణ రెడ్డి ఇంటి బయట చెప్పుల స్టాండ్‌లో పెట్టిన లేఖలో 'చేతబడి చేయకండి.. మిగిలిన వాళ్లు బంగారం అమ్ముకున్నారు.. నాకిచ్చిన డబ్బులు తెచ్చిచ్చాను.. క్షమించండి' అని రాసి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో వెళ్లి డబ్బుల బ్యాగ్, లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖ రాసిన వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నారు. దొంగతనం జరిగిన అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు కిందివైపు మాత్రమే ఉన్నాయి.. అలాగే కారిడార్‌లో సీసీ కెమెరాలు కూడా లేవు. అందుకే ఆ డబ్బులు, లేఖ ఎవరు పెట్టారో పోలీసులు గుర్తించలేకపోయారు. అలాగే అపార్ట్మెంట్ పరిసరాల్లో సీసీ కెమెరాలు పరిశీలించినా ఎలాంటి క్లూ దొరకలేదు.ఇదిలా ఉంటే.. పోలీసులు ఈ చోరీ కేసులో ఒక వ్యక్తిని అనుమానించి నిఘా పెట్టి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చోరీ ఘటన జరిగిన రోజు బీరువాపై ఒకరి వేలిముద్రలు సేకరించినట్లు తెలుస్తోంది.. ఆ వివరాలపై స్పష్టత లేదు. ఆదినారాయణ రెడ్డి ఇంటి బయట ఉంచిన లేఖలో చేతబడి గురించి ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. చేతబడి భయంతోనే డబ్బులు తిరిగి ఇంటి బయట పెట్టారా అనే అనుమానాలు మొదలయ్యాయి. అసలు ఈ చేతబడి టాపిక్ ఎందుకు వచ్చింది.. దొంగ ఎందుకు భయపడ్డాడు అన్నది తేలాల్సి