
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. 80th Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో గొందు గొందులో భారతదేశ గీతాలు వినిపించనున్నాయి. స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శనివారం జరగనున్న 80వ స్వాతంత్య్ర వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముస్తాబైంది. ప్రతి గల్లీలో.. ప్రతి ఊరిలో.. ప్రతి జిల్లాలో జరగనున్న వేడుకలకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అధికారికంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించిన వివరాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి మంత్రుల నియామకం చేపట్టింది. ఆగస్టు 15న అమరావతిలో రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు జరగనుండగా.. ఉదయం 8.30 గంటలకు అమరావతిలోని పరేడ్‌లో సీఎం చంద్రబాబు పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు. - ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ పతాకం ఆవిష్కరించనున్న మంత్రి నారా లోకేశ్ - శ్రీకాకుళంలో జెండా ఎగరేయనున్న మంత్రి అచ్చెన్నాయుడు - కృష్ణా జిల్లాలో జాతీయ పతాకం ఆవిష్కరించనున్న మంత్రి కొల్లు రవీంద్ర - పల్నాడులో జాతీయ పతాకం ఆవిష్కరించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్ - పశ్చిమగోదావరిలో మంత్రి నిమ్మల రామానాయుడు - కర్నూలులో జెండా ఆవిష్కరించనున్న మంత్రి టీజీ భరత్ - ప్రకాశంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి - పార్వతీపురం మన్యంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి - డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమలో మంత్రి వాసంశెట్టి సుభాష్ - అన్నమయ్య జిల్లాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి - అల్లూరి సీతారామరాజు