
ఇంటర్నెట్ డెస్క్: గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధ శతకం కూడా చేయలేకపోయిన భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) మళ్లీ ఫామ్ అందుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో జురెల్ (51; 68 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో రాణించాడు. ఫామ్‌లో లేకున్నా తాను ఎలాంటి ఒత్తిడికి లోను కాలేదని జురెల్ అన్నాడు. ఫామ్ కోల్పోయిన ఈ దశలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తనకు మద్దతుగా నిలిచి ఆత్మవిశ్వాసం నింపారని తెలిపాడు. లంకతో మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసిన అనంతరం ధ్రువ్ విలేకరులతో మాట్లాడాడు. ‘‘నిజాయతీగా చెప్పాలంటే ఫామ్‌లో లేకున్నా నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు ఎంతో కృతజ్ఞుడిని. ఆ గౌరవం కోసమే ఆడతాను. కెప్టెన్, హెడ్ కోచ్‌తో మాట్లాడినప్పుడల్లా వారు పరిస్థితులను వివరించి ఏం చేయాలో చెబుతుంటారు. అందుకు తగ్గట్టుగా ఆడాలని సూచిస్తారు. బ్యాటింగ్‌కు వెళ్లే ముందు నేను ఎలాంటి వ్యక్తిగత మైలురాళ్ల గురించి ఆలోచించను. కేవలం మైదానంలోకి వెళ్లి జట్టుకు ఏం అవసరమో అదే చేస్తాను. మేం 10 రోజుల ముందే ఇక్కడికి వచ్చాం. కొలంబోలో ప్రాక్టీస్ చేశాం. అంతకుముందు ‘ఇండియా ఎ’ తరఫున ఆడాం. ఇలాంటి పిచ్‌లపై సాధ్యమైనంత ఎక్కువగా బ్యాటింగ్ చేయడంపైనే నా దృష్టి ఉంది. దీని వల్ల నా బ్యాటింగ్ మెరుగుపడటమేకాక ఇక్కడి వాతావరణం, పరిస్థితులపై అవగాహన వస్తుంది. వర్షం కారణంగా ఔట్ ఫీల్డ్ తడిగా మారింది. చాలా ఓవర్లు నష్టపోయాం. అయినప్పటికీ నిలకడగా ఆడుతూ సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయడం, లోయర్ ఆర్డర్లో మంచి భాగస్వామ్యాలను నెలకొల్పడం మా ప్లాన్. పిచ్ ఇంకా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. శ్రీలంక బౌలర్ల మాదిరిగానే భారత బౌలర్లు కూడా సుదీర్ఘ సమయం పాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుందని అనుకుంటున్నా. మేం మ్యచ్ గెలవాలంటే పట్టుదలతో