
చిత్తూరు జిల్లాలోని ఎస్ఆర్పురం మండలంలో దొంగల ముఠా హల్చల్ చేసింది. ఈ ముఠా రాత్రి సమయాల్లో ఇంటి తలుపులను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతోంది. దొంగల ముఠా చర్యలను గుర్తించి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న గ్రామస్తులపై మారునాయుధాలతో దాడికి దిగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిత్తూరు, ఆగస్టు 17: జిల్లాలోని ఎస్ఆర్పురం మండలంలో దొంగల ముఠా హల్చల్ చేసింది. ఈ ముఠా రాత్రి సమయాల్లో ఇంటి తలుపులను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతోంది. దొంగల ముఠా చర్యలను గుర్తించి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న గ్రామస్తులపై మారునాయుధాలతో దాడికి దిగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిన్నతయ్యరు గ్రామంలో ఓ ఇంటి తలుపులను పగలగొడుతున్న దొంగలు చూసి స్థానికులు అరవడంతో అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. ఈ క్రమంలో పెద్దతయ్యరు గ్రామానికి చెందిన ప్రభాకర్, సురేష్.. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై దొంగలు కత్తులతో దాడికి తెగబడ్డారు. అయితే, దొంగలు దాడి చేస్తున్నప్పటికీ ధైర్య సాహసాలను ప్రదర్శించి మరీ ఎంతో చాకచక్యంగా ఒక దొంగను ప్రభాకర్, సురేష్ పట్టుకున్నారు. పట్టుకున్న దొంగకు గ్రామస్థులు దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. రాజమండ్రి గోదావరిలో ఏఈ కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ముగ్గురి గల్లంతు