
ఆడపిల్ల జీవితంలో తండ్రి అనేది ఒక కేవలం బంధం మాత్రమే కాదు.. ఒక కొండంత అభయం, జీవితాంతం తోడుండే ఒక గొప్ప మార్గదర్శకం. కూతురి ఎదుగుదలలో ప్రతి దశలోనూ తండ్రి పాత్ర చాలా కీలకమైనది. ఏ వయసులో తండ్రి ఎలాంటి ప్రేమ చూపించాలి? ఎలాంటి శ్రద్ధ చూపించాలి? ఈ వయసులో తండ్రి ఎక్కువగా భద్రత, విశ్వాసం చూపించాలి. సహజంగా ఈ వయసులో ఆడ పిల్లలకు ప్రపంచం అంటే తండ్రి చేతులే. ఈ వయసులో తండ్రి ఎక్కువగా ప్రేమను చూపించాలి. ఆ ప్రేమ ఎత్తుకోవడంపై ఉండాలి. తండ్రి ఎత్తుకొని ఆడిస్తున్నప్పుడు ఆమె పొందే స్పర్శ, ఆమెలో అపరిమితమైన సురక్షిత భావాన్ని నింపుతుంది. ఈ వయసులో తండ్రి చూపించ ప్రేమ.. పిల్లల్లో నేను సురక్షితంగా ఉన్నాను అనే కొండంత నమ్మకాన్ని ఇస్తుంది. ఈ వయసు పిల్లలతో తండ్రి ఎక్కువగా ఆడుకోవాలి. వేలు పట్టుకొని నడిపించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రతి చిన్న విషయాలకు భయపడటం లాంటివి చేయరు. 2.టీనేజ్ కి ముందు వయసు(9 నుంచి 12 సంవత్సరాలు).. ఈ వయసులో ఆడ పిల్లలు తమ చుట్టూ ఉన్న సమాజాన్ని, స్నేహితులను అర్థం చేసుకోవడం మొదలుపెడతారు. తన రూపం, తన ప్రతిభ గురించి ఆలోచించడం మొదలుపెడతారు.ఈ వయసులో తండ్రి మాటలతో ప్రేమ చూపించాలి. అంటే.. ‘ నువ్వు చాలా తెలివైన దానివి’, ‘ నువ్వు ఏదైనా సాధించగలవు’ అని ప్రతి విషయంలోనూ ప్రోత్సాహం చూపించాలి. ఈ వయసులో తండ్రి ఇచ్చే మెప్పు, బయటి ప్రపంచం నుంచి వచ్చే కంపారిజన్స్, విమర్శలను ఎదుర్కునేలా చేస్తుంది. ఈ వయసు నుంచి ఆడ పిల్లల్లో శారీరక మార్పులు జరగడం మొదలౌతాయి. అత్యంత సున్నితమైన దశ ఇది. ఈ వయసులో ఎమోషన్స్ ని కంట్రోల్ లో ఉంచుకోలేరు.. ఇతరుల పట్ల ఆకర్షణ మొదలౌతుంది. ఈ వయసులో తండ్రి... వారితో కఠినంగా కాకుండా మంచి స్నేహితుడిలా ఉండాలి. ఏది మంచి