
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Rtc bus collide with lorry near kondagattu: జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ బలంగా ఢీకొన్నాయి. ఈ క్రమంలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 20 మంది గాయపడ్డారు. క్యాబిన్ నుంచి లారీ డ్రైవర్ ను అతి కష్టం మీద స్థానికులు బైటకు తీశారు. ప్రమాదంపై సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
.