
హసన్పర్తి: అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హనుమకొండ జిల్లా యువకుడు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. హసన్పర్తి మండలం గంటూరుపల్లికి చెందిన భరత్ చందర్ రెడ్డి (29) గత నెల 25న ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. 75 శాతం కాలిన గాయాలతో అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. దాదాపు 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూశారు. ఉన్నత చదువుల కోసం 2023లో అమెరికా వెళ్లిన భరత్.. చదువు పూర్తి చేసుకుని స్వగ్రామానికి తిరిగి వచ్చి వివాహం చేసుకోవాలని భావించారు. ఇంతలోనే జరిగిన అగ్నిప్రమాదం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భరత్ మృతితో గంటూరుపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. తమ కుమారుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.