© 2026 nimisham.in
మానవత్వం చాటుకున్న పోలీసులు.. వాయువేగంతో ఎగ్జామ్ సెంటర్-వద్ద డ్రాప్ చేసిన ఖాకీలు నీట్ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థినులకు తెలుగు రాష్ట్రాల పోలీసులు కొండంత అండగా నిలిచారు. విశాఖపట్నంలో పొరపాటున వేరే సెంటర్‌కు వెళ్లిన ఒక విద్యార్థినిని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. తన టూ-వీలర్‌పై ఎక్కించుకుని ఇన్ టైమ్‌లో ఏయూ అల్గారిథమ్ సెంటర్‌కు చేర్చారు. అలాగే హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎగ్జామ్ సెంటర్ తెలియక కంగారు పడుతున్న విద్యార్థినిని ఓయూ ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ గౌడ్ తన వాహనంలో ఎక్కించుకుని పరీక్షా కేంద్రం లోపలికి పంపించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి విద్యార్థినుల ఏడాది కష్టాన్ని కాపాడిన మన పోలీసుల క్విక్ రెస్పాన్స్‌కి సెల్యూట్ చేద్దాం. ఈ వార్తకు సంబంధించిన