
పాముల పేరు వింటేనే చాలా మంది భయంతో వణికిపోతారు.. ఇక పామే కళ్ల ముందు కనిపిస్తే ఇంకేమైనా ఉందా? మరోసారి అటువైపు కాలు కూడా పెట్టరు. అలాంటిది ఇక్కడో యువకుడు మాత్రం నేరుగా పాముకే ఎదురెళ్లి.. దాని కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ రెప్పపాటులో దాన్ని పట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఎంతటి పర్ఫెక్ట్ స్నేక్ క్యాచర్ అయినా.. నాగుపామును పట్టుకోవాలంటే కాస్త తడబడతారు. కానీ ఇక్కడో యువకుడు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ప్రవర్తించాడు. రెప్పపాటులో గుంతలో దాక్కున్న పామును పట్టేశాడు. అది కూడా ఒక్క చేతితో.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి జనాలు అతని ధైర్యసాహసాలను తెగ మెచ్చుకుంటున్నారు.





