
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. New Age Movie: ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన రాస్రా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నూతన నటీనటులను పరిచయం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజు బొనగాని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఎక్కువ మంది యువత ‘ఇంజనీరింగ్’ చేస్తున్నారు. ఆ తర్వాత ఏంటనేది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. అందుకే ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’ అనే యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో రాజు బొనగాని తన కంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. వినూత్న కథలను, ఎమోషనల్ లవ్ స్టోరీ లను ఎప్పుడు ఆదరించే తెలుగు ప్రేక్షకులకు ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఎక్కువ కాలం గుర్తిండిపోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం ఈ సినిమా పాటలు రికార్డింగ్ జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. త్వరలోనే చిత్రానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆఫ్టర్ ఇంజనీరింగ్( థిస్ ఈజింట్ జస్ట్ మై స్టోరీ, ఇట్స్ అవర్ స్టోరీ ) ఇది నా స్టోరీ మాత్రమే కాదు మన అందరి స్టోరీ అనే శీర్షికతో వస్తున్న ఈ చిత్రం ఇప్పటి జెన్‌జీ, జెన్‌జీ ఆల్ఫాను ప్రతిబింబించేలా ఈ సినిమా ఉండబోతున్నట్టు చెప్పుకొచ్చారు. రాస్రా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోందని చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను త్వరలోనే ఒక ప్రత్యేక ఈవెంట్