
హ్యూస్టన్లో తెలుగు సాంస్కృతిక సమితి స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 7, 8 తేదీల్లో ఫోర్ట్ బెండ్ ఎపిక్ సెంటర్లో జరిగిన కార్యక్రమాల్లో సంస్థ 50 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుని, వ్యవస్థాపక బృందాన్ని ఘనంగా సన్మానించారు. ఇంటర్నెట్ డెస్క్: తెలుగు సాంస్కృతిక సమితి హ్యూస్టన్ స్వర్ణోత్సవ వేడుకలు ఆగస్టు 7, 8 తేదీల్లో ఫోర్ట్ బెండ్ ఎపిక్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. సంస్థ 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని వ్యవస్థాపక బృందాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా వారి దూరదృష్టి, సేవలను ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. ఈ స్వర్ణోత్సవ వేడుకల్లో అడుగడుగునా తెలుగు సంస్కృతి, సాహిత్య వైభవం కనిపించింది. వేదికల అలంకరణలు, సభా ప్రాంగణాలకు పెట్టిన పేర్లలోనూ తెలుగుదనం స్పష్టంగా కనిపించింది. ప్రధాన వేదికకు ‘తెలుగు విజయం’ అని పేరు పెట్టగా, ఉప వేదికలకు నన్నయ, తిక్కన, ఎర్రన్న, పోతన పేర్లను పెట్టారు. ఇది తెలుగు భాష, సాహిత్యానికి ఇచ్చిన గౌరవానికి ప్రతీకగా నిలిచింది. సభా వేదిక ముందు ఏర్పాటు చేసిన ‘స్వాగత తోరణం’ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాకతీయ, విజయనగర, శాతవాహన కాలాల సంస్కృతి, కళా వైభవాన్ని ప్రతిబింబించేలా దీనిని రూపొందించారు. శ్రీ సీతారాముల కల్యాణం, వేద పఠనం, పూర్ణకుంభ స్వాగతంతో తెలుగు సాంస్కృతిక సమితి హ్యూస్టన్ స్వర్ణోత్సవ వేడుకలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. శ్రీ వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక సావనీర్లో సంస్థ 50 ఏళ్ల చారిత్రక ప్రస్థానాన్ని అక్షరబద్ధం చేశారు. ఈ స్వర్ణోత్సవాల్లో పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అవసరాల శ్రీనివాసరావు, వామరాజు సత్యమూర్తి, బలభద్రపాత్రుని రమణి, అరుణ సుబ్బారావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వారు తమ విలువైన ఆలోచనలు, అనుభవాలను పంచుకోవడంతో పాటు తెలుగు భాష, సాహిత్యంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో స్వర్ణోత్సవ వేడుకలకు మరింత ప్రత్యేకత వచ్చింది. తెలుగు సాంస్కృతిక సమితి హ్యూస్టన్ 50 ఏళ్ల ప్రస్థానాన్ని ‘స్వర్ణ