© 2026 nimisham.in

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. TS Police Jobs 2026: చాలా కాలంగా పోలీస్ ఉద్యోగం కావాలనుకుంటున్న అభ్యర్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఇటీవల ఐదు వేల ఎస్సై, కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి సంబంధించిన సమాచారం తెలియగా, ఇప్పుడు ఆ సంఖ్యను మరింత పెంచింది. రాష్ట్రంలో మొత్తం 7437 పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు రోజుల క్రితం 5000 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా, తాజాగా మరో 2437 పోస్టులను జోడించారు. ఇందులో ఫైర్ డిపార్ట్మెంట్లో 790, జైలు విభాగంలో 223, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 1424 పోస్టులు ఉన్నాయి. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది
.