
పీఎం-మత్స్య సంపద యోజనలో భారీ అక్రమాలు చేపల చెరువులు తవ్వకుండానే తవ్వినట్లు రికార్డులు రెండేళ్లలో రూ.80 కోట్ల దుర్వినియోగం అక్రమాలను ధ్రువీకరించిన విచారణ బృందం వ్యవహారం బయటికి రాకుండా తొక్కిపెట్టిన వైనం మత్స్యశాఖ డైరెక్టరేట్‌లోని ఓ ఉన్నతాధికారి హస్తం! వరుసగా ఒకే సంస్థకు రొయ్య పిల్లల సరఫరా టెండర్లు హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎం-ఎంఎ్సవై) పథకానికి ఎంపికయ్యారు.. చేపల చెరువులు తవ్వారు.. చేపలు పెంచుతున్నామంటూ భారీగా సబ్సిడీలు పొందారు.. కానీ వెళ్లి చూస్తే.. అక్కడ చెరువులూ లేవు.. చేపలూ లేవు.. కేవలం కాగితాలపైనే అన్నీ సృష్టించారు. కొందరు లబ్ధిదారుల పేరిట అధికారులే దండుకున్నారు. కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. గతం లోనే దీనిపై ఫిర్యాదులు రాగా, విచారణ జరిపిన కేంద్రం ఎన్నో అవకతవకలు ఉన్నట్టు తేల్చింది. ఇది జరిగి సుమారు మూడేళ్లయినా నివేదికను బయటపెట్టలేదు. సదరు అక్రమార్కులపై చర్యలు చేపట్టలేదు. అయితే ఈ వ్యవహారంలో రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టరేట్‌లోని ఒక ఉన్నతాధికారి హస్తం ఉన్నట్టు తాజాగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో.. అక్రమాల వ్యవహారం బయటికి వచ్చింది. రూ.80 కోట్ల మేర దుర్వినియోగం! కేంద్రం దేశవ్యాప్తంగా కొత్త చేపల చెరువుల తవ్వకానికి, చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు పీఎం-ఎంఎస్వై పథకాన్ని అమలు చేస్తోంది. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో తవ్విన చేపల చెరువును ఒక యూనిట్‌గా తీసుకుంటారు. ఒక్కో యూనిట్ విలువ రూ.11 లక్షలుకాగా.. అందులో 60 శాతం సబ్సిడీ కింద అందుతుంది. ఇక కోల్డ్ స్టోరేజీలు, బయో యూనిట్ల నిర్మాణానికి రూ.8 లక్షల చొప్పున రుణసాయం అందిస్తారు. ఇందులోనూ రూ. 3.20 లక్షలు సబ్సిడీ అందుతుంది. అయితే రాష్ట్రంలో ఈ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని, రెండేళ్ల వ్యవధిలో రూ.80 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. దీనితో కేంద్రం విచారణకు ఆదేశించింది. రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టరేట్ నుంచి ఒక సీనియర్ అధికారి నేతృత్వంలోని బృందం క్షేత్రస్థాయిలో