
మేడారం వనదేవతల సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేయూత పెన్షన్లకు శ్రీకారం చుట్టారు. చేయూత పెన్షన్ల కొత్త లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. మేడారంలో సీఎం ఆదివారం పర్యటించారు. ములుగు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): మేడారం వనదేవతల సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) చేయూత పెన్షన్లకు శ్రీకారం చుట్టారు. చేయూత పెన్షన్ల కొత్త లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. మేడారంలో సీఎం ఈరోజు (ఆదివారం) పర్యటించారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క-సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించారు. మేడారం అభివృద్ధి పనులను సీఎం పరిశీలించారు. గట్టమ్మ ఆలయం దగ్గర పంచాయతీరాజ్ శాఖ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం మేడారం నుంచి సీఎం ములుగు, పరకాల వెళ్లారు. పరకాలలో రూ.443.42కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ములుగులో రూ.868 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నూతన కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.16 ఎకరాల్లో రూ.63 కోట్లతో భవన సముదాయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. వనదేవతలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. ఆనాడు టీపీసీసీ అధ్యక్షుడిగా ములుగు నుంచే తాను పాదయాత్ర ప్రారంభించానని ప్రస్తావించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని తీరుస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక మేడారం ఆలయాన్ని అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. రామప్ప దేవాలయంతో సమానంగా మేడారం అభివృద్ధి చేశామని వెల్లడించారు. త్వరలోనే మల్లూరు నరసింహస్వామి ఆలయానికి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. జంపన్న వాగును కూడా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర నలుమూలలా తిరిగి ప్రతీ గూడేనికి, పల్లెకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం ఓ భరోసా ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తెలిపారు. అక్కగా సీతక్క మీ సమస్యల్ని పరిష్కరిస్తోందన్నారు. మేడారం సమ్మక్క సారక్క ప్రాంగణాన్ని