
నాగార్జునసాగర్ విజయ విహార్ కృష్ణ నది వద్ద నిర్వహిస్తున్న వరుణ యాగంలో సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. పూర్ణహుతిలో భాగంగా పూజలు చేస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ విజయ విహార్ కృష్ణ నది వద్ద నిర్వహిస్తున్న వరుణ యాగంలో ఈరోజు (సోమవారం) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. పూర్ణహుతిలో భాగంగా పూజలు చేస్తున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో యాగ క్రతువులు నిర్వహిస్తున్నారు. 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో మహాయాగం జరిపిస్తున్నారు. ఇవాళ ఉదయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యాగాన్ని ప్రారంభించారు
.