రంభ ఊర్వశి మేనక

నేటినుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

సర్పంచ్ల నిధులకై ప్రభుత్వం బిల్లు

సర్కార్ను టార్గెట్ చేసిన బీఆర్ఎస్

Telangana Assembly: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు అత్యంత ఘనంగా, ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు(Telangana Assembly) ప్రారంభం కానుండగా, ప్రశ్నోత్తరాల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్రశిక్ష, పీఎం శ్రీ 2024–25 ఆడిట్ నివేదికలతో పాటు మెట్రోకు సంబంధించిన ఐదు వార్షిక నివేదికలను సభ ముందుకు తీసుకురానున్నారు. ముఖ్యంగా వివాదాస్పదంగా మారిన 22ఏ భూముల వ్యవహారంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సంపూర్ణంగా సిద్ధమైంది. సర్పంచ్లకు నేరుగా నిధులు అందేలా కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది.

Kalvakuntla Kavitha: పరీక్ష రాసే డీజీపీ అయ్యావా? కానిస్టేబుల్ను వెంటనే అరెస్ట్ చేయాలి.. డీజీపీపై కల్వకుంట్ల కవిత ఫైర్

గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు.. ప్రభుత్వానికి బీఆర్ఎస్ బిగ్ షాక్:

మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అన్ని కోణాల్లో నిలదీసేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. సభకు వెళ్లేముందు ఉదయం 9 గంటలకు గన్ పార్క్ వద్ద గులాబీ నేతలు అమరులకు నివాళులర్పించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కనీసం నెల రోజుల పాటు సభను నిర్వహించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల పురోగతిపై ప్రభుత్వాన్ని గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమాయత్తమయ్యారు.

రైతులు, విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలే అజెండా.. తీవ్ర కాకరేపనున్న చర్చలు:

సభలో ప్రధానంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, రైతు రుణమాఫీ, కరెంట్ కోతలు వంటి కీలక సమస్యలపై గళమెత్తేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. ఉద్యోగుల పీఆర్సీ, డీఏల విడుదల, పాలిటెక్నిక్ జీవో 97, సింగరేణి వ్యవహారాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడమే ప్రధాన అజెండాగా పెట్టుకుంది. ఈ నెల 11 వరకు సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా, బీఏసీ సమావేశంలో క్లారిటీ రానుంది. సభలో చోటుచేసుకునే ఈ రాజకీయ ఘర్షణతో తెలంగాణ పొలిటికల్ హీట్ ఒక్కసారిగా తీవ్ర స్థాయికి చేరింది.