© 2026 nimisham.in

స్వదేశంలో అఫ్గానిస్తాన్ జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ మంగళవారం టీమిండియా జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనుండగా, జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చిన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక బుమ్రాను ఎంపిక చేసినప్పటికీ, అతడు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలు ఎంపికైనప్పటికీ, వీరు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది. ఇక అఫ్గానిస్తాన్‌తో టీమిండియా సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ కోసం సెలెక్టర్లు ప్రధాన బౌలర్లను చోటివ్వగా.. గాయం నుంచి కోలుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్క్వాడ్‌లోకి వచ్చాడు. రవి బిష్ణోయ్ రెండో స్పిన్నర్‌గా స్థానం సాధించాడు. బుమ్రా, హర్షిత్, వరుణ్ రాకతో ఇంగ్లండ్ గడ్డపై ఆడిన ప్రసిధ్ కృష్ణ, సూర్యాన్ష్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ జట్టులో చోటు కోల్పోయారు. అయితే జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ బుమ్రా, నితీశ్, సుందర్, రాణాలు ఈ సిరీస్‌లో ఆడతారా? లేదా?అనేది ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్లు పేర్కొన్నారు. ఇక ఆఫ్గన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టునే ఆసియా గేమ్స్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు మార్పులు మినహా దాదాపు ఇదే జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. ఇక ఆసియా క్రీడలు జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్
Sep 1 2026 5:54 PM | Updated on Sep 1 2026 6:48 PM
స్వదేశంలో అఫ్గానిస్తాన్ జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ మంగళవారం టీమిండియా జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. ఇక స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనుండగా, జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు విశ్రాంతినిచ్చిన సంజూ శాంసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
ఇక బుమ్రాను ఎంపిక చేసినప్పటికీ, అతడు ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలు ఎంపికైనప్పటికీ, వీరు కూడా ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించాల్సి ఉంటుంది.
ఇక అఫ్గానిస్తాన్‌తో టీమిండియా సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. తొలి టీ20 మ్యాచ్ సెప్టెంబర్ 13న, రెండో టీ20 సెప్టెంబర్ 15న, మూడో టీ20 సెప్టెంబర్ 17న జరగనున్నాయి. ఈ మూడు టీ20లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది.
ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ కోసం సెలెక్టర్లు ప్రధాన బౌలర్లను చోటివ్వగా.. గాయం నుంచి కోలుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్క్వాడ్‌లోకి వచ్చాడు. రవి బిష్ణోయ్ రెండో స్పిన్నర్‌గా స్థానం సాధించాడు. బుమ్రా, హర్షిత్, వరుణ్ రాకతో ఇంగ్లండ్ గడ్డపై ఆడిన ప్రసిధ్ కృష్ణ, సూర్యాన్ష్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ జట్టులో చోటు కోల్పోయారు. అయితే జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ బుమ్రా, నితీశ్, సుందర్, రాణాలు ఈ సిరీస్‌లో ఆడతారా? లేదా?అనేది ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్లు పేర్కొన్నారు.
ఇక ఆఫ్గన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టునే ఆసియా గేమ్స్‌కు పంపనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు మార్పులు మినహా దాదాపు ఇదే జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. ఇక ఆసియా క్రీడలు జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి.
భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్*, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా*, అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా*
Read: పాక్ క్రికెట్లో సంక్షోభం; మనస్తాపానికి గురై పదవికి రాజీనామా!
మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)
తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)
హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)
కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)
భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్
సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు
పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా
అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్