
Team India : శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమ్ఇండియాను గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. గాయాల కారణంగా ఇప్పటికే ఐదుగురు కీలక ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, సాయి సుదర్శన్ లు ఈ సిరీస్‌కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐపీఎల్లో ఫ్రాంచైజీల ఒత్తిడి, ఆర్థిక అంశాల కారణంగా కొంతమంది క్రికెటర్లు గాయాలతోనే మ్యాచ్‌లు ఆడుతున్నారని, అనంతరం వారు అంతర్జాతీయ క్రికెట్‌కు వచ్చేసరికి వారి ఫిట్నెస్ను నిర్వహించే బాధ్యత CoE ఫిజియోలపై పడుతోందని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. PM Modi : కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లతో ప్రధాని మోదీ.. ‘మానవ శరీరానికి కూడా పరిమితులు ఉంటాయి. ముఖ్యంగా వయసు పెరిగిన ఆటగాళ్లలో అధికంగా ఆడడం, ఒత్తిడి కారణంగా వచ్చే గాయాల నుంచి వారు ఎప్పుడు తిరిగి వస్తారో అంచనా వేయడం కష్టం. ఐపీఎల్లో ఫ్రాంచైజీ, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా ఆటగాళ్లు గాయాలతోనే ఆడుతున్నారు. ఆ తర్వాత వారు CoE ఫిజియోల వద్దకు వస్తున్నారు. టీమ్ ఫిజియోలు, CoE ఫిజియోలు ఆటగాళ్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బాధ్యతగా పనిచేస్తున్నారు. అయితే ఈ పరిస్థితి సెలెక్టర్లు, కోచ్‌లు, కెప్టెన్లకు ఇబ్బందికరంగా మారుతోంది.’ అని ఆ అధికారి పేర్కొన్నట్లు ఏఎన్ఏ తెలిపింది. భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్‌కు గాలె ఆతిథ్యం ఇవ్వనుంది. శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు ఇదే.. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్( వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్( వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, అకిబ్ నబీ