
IND vs SL : గాలే వేదికగా శనివారం నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్లను బరిలోకి దించే అవకాశం ఉందని టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ వెల్లడించాడు. కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, రవీంద్ర జడేజాలు సాటిలేని వైవిధ్యం, వికెట్లు తీసే నైపుణ్యాలను కలిగి ఉన్నారన్నాడు. కుల్దీప్ యాదవ్ ఎటాకింగ్ బౌలర్ అని, అతడి అనుభవం తమకు తప్పకుండా పనికి వస్తుందన్నాడు. మానవ్ సుతార్ బంతిని కాస్త ఎక్కువగా టర్న్ చేస్తాడని చెప్పుకొచ్చాడు. ఇక జడేజా అత్యంత నిలకడగా లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తాడని తెలిపాడు. ఈ ముగ్గురు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నాడు. ఈ ముగ్గురికి 20 వికెట్లను తీయగలిగే సత్తా ఉందని, వారిని కెప్టెన్ గిల్ ఎలా ఉపయోగించుకుంటాడనేది ముఖ్యమన్నాడు. BCCI : బీసీసీఐ కీలక నిర్ణయాలు! వీవీఎస్ లక్ష్మణ్‌కు ప్రమోషన్..! అజిత్ అగార్కర్‌కు.. పిచ్ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామన్నాడు. ఇక ఇలాంటి పిచ్ పై బ్యాటింగ్ చేయడం సవాలేనని అన్నాడు. అదే సమయంలో ఏ బౌలర్‌తో ఎప్పుడు బౌలింగ్ చేయించాలనేది నిర్ణయించడం కూడా కీలకమేనని తెలిపాడు. తాము అన్ని సవాళ్లకు సిద్ధంగా ఉన్నట్లు వివరించాడు. పేసర్ సిరాజ్ కు అండగా ఉండేది ఎవరు అనేది ఇప్పుడే తాను చెప్పలేన్నాడు. గుర్నూర్ బ్రార్ లేదా ప్రసిద్ధ్ కృష్ణలలో ఎవరికి తుది జట్టులో చోటు లభించినా వారు అత్యుత్తమంగా బౌలింగ్ చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపాడు.25 నుంచి 35 ఓవర్ల తరువాత బంతి మెత్తబడుతుందన్నాడు. షార్ట్ బాల్స్ వేసి ప్రత్యర్థి బ్యాటర్లను అడ్డుకోవడంపైనా దృష్టి పెడతామన్నాడు