© 2026 nimisham.in
రాగి పిండితో సంగటి చేసుకుంటే చాలా బాగుంటుంది. సాంబార్‌తో తింటే మరింత రుచిగా ఉంటుంది. బియ్యానికి బదులుగా సామలతో పులిహోర చేయొచ్చు. ఆరోగ్యానికి మంచిదే. పైగా టేస్టీగా కూడా ఉంటుంది. సజ్జ పిండితో లడ్డూలు చేసుకోవచ్చు. నెయ్యి, బెల్లం, డ్రై ఫ్రూట్స్‌తో చేసుకుంటే చాలా బాగుంటాయి. బెల్లం, పాలు, అరికెలతో పాయసం చేయొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది మంచి స్వీట్ ఐటమ్. ఊదలతో దోశలు చేసుకోవచ్చు. కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. రాగి పిండితో బిస్కెట్లు చేసుకోవచ్చు. ఎక్కువ సమయం పట్టదు. ఆరోగ్యానికి కూడా మంచిదే. కొర్రలతో పులావ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మసాలా దినుసులు, కూరగాయలతో చేస్తే భలే రుచిగా ఉంటుంది. సామలతో ఇడ్లీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చట్నీ, సాంబార్‌తో తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రాగి మాల్ట్ టేస్టీగానే ఉంటుంది. ఇది కూడా ఈజీగా తయారవుతుంది. ఉదయం లేదా సాయంత్రం తాగొచ్చు
.