
తమిళనాడులోని ఓ ప్రభుత్వ పాఠశాల తరగతి గదిలో కొందరు విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెను దుమారం రేగింది. విద్యాసంస్థల్లో విద్యార్థుల క్రమశిక్షణ, భద్రత, పర్యవేక్షణపై ఈ ఘటన తీవ్ర ఆందోళనలకు దారితీసింది. స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే విచారణకు ఆదేశించడంతో పాటు, పాఠశాల ప్రిన్సిపాల్‌పై బదిలీ వేటు వేశారు.వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లాలోని తక్కలె ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల కోసం ఆగస్టు 1న శనివారం నిర్వహించిన ప్రత్యేక తరగతులు ముగిసిన తర్వాత కొందరు అమ్మాయిలు ఒక తరగతి గదిలో గుమికూడారు. బయటి నుంచి తెచ్చుకున్న మద్యం బాటిళ్లు, ఆహార ప్యాకెట్లతో వారు పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో స్టూడెంట్ ఈ దృశ్యాలను తన ఫోన్లో రహస్యంగా చిత్రీకరించడంతో ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోను ఆన్లైన్లో సర్క్యులేట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.ఈ వీడియో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కన్యాకుమారి జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. వీడియో ఎప్పుడు చిత్రీకరించారు, అందులో ఉన్నవారు నిజంగా ఆ పాఠశాల విద్యార్థులేనా, పాఠశాల ప్రాంగణంలోకి మద్యం ఎలా వచ్చింది, ప్రత్యేక తరగతుల సమయంలో సరైన పర్యవేక్షణ ఉందా లేదా అనే అంశాలపై విచారణ జరపాలని అధికారులను నిర్దేశించారు.ఈ ఘటనలో పర్యవేక్షణ వైఫల్యం కింద ప్రాథమిక చర్యగా పాఠశాల ప్రిన్సిపాల్ ప్రమీలా ఇవాంజెలిన్ను నాగర్‌కోయిల్‌లోని వడస్సెరీ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ