
విద్యార్థుల నిరసనలపై నిబంధనలు రద్దు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం ఉపసంహరణతో విద్యార్థులకు స్వేచ్ఛ Tamil Nadu Government: తమిళనాడులో విద్యార్థుల రాజకీయ భాగస్వామ్యం, నిరసన ప్రదర్శనలపై విధించిన సంచలనాత్మక ఆంక్షల విషయంలో సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం(Tamil Nadu Government) కీలకమైన వెనకడుగు వేసింది. వామపక్ష రంగాలు, కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆధ్వర్యంలో నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో విద్యార్థులు పాల్గొనకుండా నిషేధిస్తూ గతంలో జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను ప్రభుత్వం బుధవారం అధికారికంగా ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయంతో విద్యార్థుల సంఘాలు, రాజకీయ వర్గాల నుంచి వ్యక్క్తమైన నిరసనలకు తెరపడినట్లయింది. YS Jagan: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మాదే.. కూటమి పాలనపై తీవ్ర వ్యతిరేకత.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు గత ఉత్తర్వుల్లో ఉన్న ప్రధాన మార్గదర్శకాలు: గతంలో కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ జారీ చేసిన కఠిన నిబంధనల ప్రకారం, వామపక్షాలు, సిజెపి నిర్వహించే ఏ విధమైన ధర్నాలు లేదా నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు, పోలీసులు, జిల్లా యంత్రాంగాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ విద్యార్థులను నిరుత్సాహపరచాలని, వారిపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వుల ఉపసంహరణతో మారిన పరిస్థితులు: అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఉపసంహరణ నిర్ణయంతో పాత ఉత్తర్వులు పూర్తిగా రద్దయ్యాయి. ఇకపై వివిధ శాఖలు, జిల్లా యంత్రాంగాలు విద్యార్థుల భాగస్వామ్యాన్ని నిరోధించడం లేదా వారిపై తీసుకున్న చర్యల నివేదికలను సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ తాజా చర్యతో విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులకు, నిరసన తెలిపే స్వేచ్ఛకు ప్రభుత్వం మళ్లీ ప్రాధాన్యం ఇచ్చినట్లయింది