
తమిళనాడు బంగారు ఉంగరాల పథకం టెండర్లో జాయలక్కాస్ జ్యువెల్లర్స్ చేసిన ₹0.01 కోట్ ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే శిశువులకు 1 గ్రాము 22 క్యారెట్ బంగారు ఉంగరం అందించేందుకు ఈ పథకం రూపొందించారు. బంగారం ధర కాకుండా మేకింగ్, హాల్మార్కింగ్, బీమా, రవాణా ఖర్చులన్నింటికీ జాయలక్కాస్ కేవలం ఒక్క పైసా కోట్ చేసింది. దీంతో టెండర్లో అత్యల్ప ధరదారుగా నిలవగా, కల్యాణ్ జ్యువెల్లర్స్ కూడా అదే ధరకు సరఫరా చేసేందుకు అంగీకరించింది. అయితే ఒక్క పైసాకే గ్రాము బంగారం ఇస్తున్నారనే అర్థం కాదు. అసలు బంగారం ధరను ప్రభుత్వమే మార్కెట్ రేటు ప్రకారం విడిగా చెల్లిస్తుంది. తమిళనాడు బంగారు ఉంగరాల పథకాన్ని ‘తాయ్మామన్ తంగ మోతిరం తిట్టం’ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చింది. తమిళ సంప్రదాయంలో మేనమామ శిశువుకు కానుక ఇచ్చే ఆచారాన్ని ఆధారంగా చేసుకుని ఈ పథకాన్ని రూపొందించారు. తమిళనాడు శాశ్వత నివాసుల కుటుంబాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పుట్టిన శిశువులకు ఉంగరం అందిస్తారు. సీఎం సి. జోసెఫ్ విజయ్ పుట్టినరోజైన 2026 జూన్ 22 నుంచి జన్మించిన పిల్లలకు పథకం వర్తిస్తుంది. అధికారికంగా 2026 సెప్టెంబర్ 15న పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఉంగరం 1 గ్రాము బరువుతో 22 క్యారెట్, 916 బీఐఎస్ హాల్మార్క్ ప్రమాణాలతో ఉండనుంది. తమిళనాడు బంగారు ఉంగరాల పథకం కోసం ప్రభుత్వం ఏటా సుమారు ₹755.83 కోట్లు కేటాయించింది. దాదాపు 4.41 లక్షల బంగారు ఉంగరాలను సరఫరా చేయాలనే లక్ష్యంతో తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ టెండర్లు పిలిచింది. మొత్తం 11 కంపెనీలు పోటీపడగా, అసలు బంగారం ధర ఈ పోటీలో భాగం కాదు. దీంతో మేకింగ్ ఛార్జీలు, హాల్మార్కింగ్, ప్యాకింగ్, బీమా, రవాణా వంటి అదనపు ఖర్చులపైనే కంపెనీలు ధరలు సమర్పించాయి. ఇదిలా ఉండగా, ఇతర సంస్థలు వందల నుంచి వేల రూపాయల వరకు కోట్ చేయగా