© 2026 nimisham.in
చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందతో చెస్ ఆడిన సీఎం విజయ్.. సోషల్ మీడియాలో వైరల్ తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. యువ చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందతో కలిసి చెస్ బోర్డుపై ఎత్తులు వేస్తూ సందడి చేశారు. నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో చరిత్రాత్మక విజయం అనంతరం... ప్రజ్ఞానందను చెన్నైలోని సచివాలయంలో సీఎం విజయ్ కలిశారు. ఈ సందర్భంగా సీఎం విజయ్, ప్రజ్ఞానందతో కాసేపు సరదాగా చెస్ ఆడారు. బోర్డుపై సీఎం విజయ్ పావులు కదుపుతుండగా... పక్కనే ఉన్న ప్రజ్ఞానంద నవ్వుతూ ఆ ఎత్తులను గమనించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నమెంట్లో టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడిగా... ప్రజ్ఞానంద సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ టోర్నీలో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద రెండుసార్లు ఓడించడం విశేషం. ఈ అద్భుత విజయంతో దేశానికి... తమిళనాడు రాష్ట్రానికి మంచి గుర్తింపు తెచ్చినందుకు గానూ... ముఖ్యమంత్రి విజయ్ యువ గ్రాండ్‌మాస్టర్‌ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో... ముఖ్యమంత్రి విజయ్, ప్రజ్ఞానందకు 50 లక్షల రూపాయల నగదు బహుమతి చెక్కును అందజేశారు. ఈ వార్తకు సంబంధించిన