
నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై, మితవాద రాజకీయ వ్యాఖ్యాత టీజీ మోహన్‌దాస్‌ను ఆదివారం కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై, మితవాద రాజకీయ వ్యాఖ్యాత టీజీ మోహన్‌దాస్‌ను ఆదివారం కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరువనంతపురం సైబర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ప్రత్యేక బృందం ఆదివారం సాయంత్రం కొచ్చిలోని మట్టాంచేరిలో ఉన్న మోహన్‌దాస్ నివాసానికి చేరుకుంది. స్థానిక పోలీసుల సహకారంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు (TG Mohandas Arrest). ఢిల్లీలో విద్యార్థుల నిరసన సామూహిక అత్యాచార ఘటనలకు దారితీయవచ్చని మోహన్‌దాస్ అన్నారని ఆరోపణలు ఉన్నాయి. 'నిరసనలో పాల్గొనే అమ్మాయిలకు అత్యాచారాలంటే ఇష్టం. అత్యాచారానికి గురవ్వడాన్ని ఆస్వాదించే అమ్మాయిలు కూడా ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఫిర్యాదులూ ఉండవు' అని ఆయన తన యూట్యూబ్ వీడియోలో అన్నారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే తాను అధికారంలో ఉంటే కర్ఫ్యూ విధిస్తానని, మాట వినని నిరసనకారులపై కాల్పులు జరుపుతానని కూడా మోహన్ దాస్ అన్నట్లు ఆరోపణలు ఉన్నాయి (Kerala Right Wing Activist). కొంతమంది మరణించినా లేదా శాశ్వతంగా గాయపడినా, గంటల్లోనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, మృతదేహాలను ఆసుపత్రులకు తరలిస్తామని ఆయన పేర్కొన్నారని ఫిర్యాదులు అందాయి (Delhi Student Protest). మోహన్ దాస్ యూట్యూబ్ ఖాతా, వివాదాస్పద వీడియోను రూపొందించేందుకు, ప్రసారం చేసేందుకు ఉపయోగించిన డిజిటల్ పరికరాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. మక్కా ఒప్పందంలో చేరనున్న ఈజిప్ట్.. టర్కీ కీలక ప్రకటన.. సౌదీ అరామ్కోపై డ్రోన్ దాడి.. హౌతీల కీలక ప్రకటన