© 2026 nimisham.in

Suryakumar Yadav: భారత టీ20 జట్టుకు తిరిగి రావడానికి సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశాలు పూర్తిగా మూసుకుపోలేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం జట్టు ప్రణాళికల్లో ఆయన లేకపోయినా, దేశవాళీ క్రికెట్లో నిలకడగా పరుగులు సాధిస్తే పునరాగమనానికి తలుపులు తెరిచే ఉంటాయని పేర్కొన్నాయి. యూకే పర్యటనలో భారత్.. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను 0-2తో కోల్పోగా, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-4తో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐపీఎల్లో తన నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్న అయ్యర్‌కు టీ20 జట్టు పగ్గాలు అప్పగించినప్పటికీ, ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో విజయాలను అందించలేకపోయాడు. ఇక, భారత్.. జింబాబ్వే పర్యటనకు సిద్ధమవుతోంది. జూలై 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. యూకే పర్యటనలో ఎదురైన నిరాశను మరచి, ఈ సిరీస్‌లో విజయాలతో తిరిగి గాడిన పడాలని భారత జట్టు ఆశిస్తోంది. అదే సమయంలో, దేశవాళీ క్రికెట్లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే సూర్యకుమార్ యాదవ్ మళ్లీ భారత జెర్సీ ధరించే రోజు దూరంలో ఉండకపోవచ్చు అనే ప్రచారం ఊపందుకుంది.. కాగా, ఐపీఎల్లో విఫలం అయ్యాడని.. భారత్‌కు టీ-20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌ను పక్కన పెడతారా? కనీసం జట్టులో కూడా ఉండకుండా చేస్తారా? అనే విమర్శలను బీసీసీఐ ఎదుర్కొన్న విషయం విదితమే
..