© 2026 nimisham.in

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Surya Sankranthi: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా ప్రవేశించడం వలన కొన్ని రాశులకు శుభాశుభా ఫలితాలుంటాయి. గ్రహాల రాజు అయిన సూర్యుడు ప్రస్తుతం మిథున రాశిలోకి సంచరిస్తున్నాడు. ఆ తర్వాత జూలై 16న సూర్యుడు మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇలా ప్రవేశించడం వలన కొన్ని రాశులకు తిరుగులేని ఆధిపత్యం దక్కబోతున్నట్టు తెలుస్తుంది. సూర్య రాశిఫలం.. సూర్య గోచార ప్రభావాలు 2026: సూర్యుడు త్వరలో తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఈసారి, సూర్యుడు చంద్రుడికి సంబంధించిన కర్కాటకంలో మారబోతున్నాడు. సూర్యుడు గ్రహాలకు రాజు. సూర్యుని గోచారం రాశుల వారి జీవితాలలో అనేక మార్పులను తీసుకువస్తుంది. ప్రస్తుతం, గ్రహాలకు రాజు అయిన సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడు త్వరలో కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈసారి, సూర్యుని రాశి మార్పు చంద్రుని రాశిలో జరగనుంది. సూర్యుని సంచారం ముఖ్యంగా కర్కాటక, తులా, మీన, మిథునం, కన్య రాశి వాళ్లకు గొప్ప యోగాన్ని ఇవ్వబోతుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా జీవితం ఉంటుంది. గతంలో వసూలు కానీ డబ్బులు మీ చేతికి అందుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలోకి వారికీ అనుకూలంగా ఉండబోతుంది. వివాహాం కానీ స్త్రీ, పురుషులకు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలున్నాయి. పోటీ పరీక్షలు రాసిన వారికీ మంచి ఉద్యోగం దక్కే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో గతంలో కంటే మీ సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడే అవకాశాలునాయి. ఈ సమయంలో ప్రయాణం చేయడం
మీకు అత్యంత ప్రయోజనకరం. విశాల దృక్పథంతో ఆలోచించాలి. పూర్వీకులకు సంబంధించిన ఆస్తి వివాదాల్లో మీదే పై చేయి కావొచ్చు.
కర్కాటక రాశిలో సూర్యుని సంచారం కారణంగా ఏ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి..
కర్కాటకంలో సూర్యుడి సంచారం వలన సింహ, మేష, కుంభ రాశుల వారు అప్రమత్తంగా మెలగాలి. మీ ఆర్థిక పరిస్థితి మారవచ్చు. ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉన్నాయి. ఏ విషయంలో అయినా ఆచితూచి వ్యవహరించాలి. పరిస్థితులు మీకు ప్రతికూలంగా మారవచ్చు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తె అవకాశాలున్నాయి. కాబట్టి వాదనలకు దిగకపోవడమే బెటర్. మీ ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశాలున్నాయి. విజయం సాధించడానికి చాలా కృషి అవసరం. మీరు పనిలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు.
సూర్య సంచారం సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
ప్రతిరోజూ సూర్యునికి జలాభిషేకం లేదా అర్ఘ్యం ఇవ్వడం ద్వారా, మీ జాతకంలోని సూర్యుడి బలం పెరగుతుంది. ప్రతి రోజు సూర్యుడికి సంబంధించిన స్తోత్రంతో పాటు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన గ్రహ దోషాల నుంచి బయటపడవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్న మాట.
గమనిక: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం అని జీ మీడియా ధృవీకరించడం లేదు. ఇక్కడ ఇచ్చిన సమాచారం గ్రహగతులు, హిందూ ధర్మ శాస్త్రాల్లో ఉన్న విసయాన్నే మేము చెప్పాము. మరింత విలువైన సమాచారం కోసం సంబంధిత రంగంలోని నిపుణులైన పండితుల సంప్రదించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.