© 2026 nimisham.in

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Surya Rahu Gochar: సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశం వలన రాహువుతో షడాష్టక యోగం కూడా ఏర్పడుతుంది, ఇది కుంభ, మకర, మిథున రాశుల వారికి అనేక సమస్యలను తీసుకురాబోతున్నట్టు గ్రహ గోచారం చెబుతుంది. సూర్య సంచారం వల్ల ఏ రాశుల వారు ప్రతికూలంగా ప్రభావితమవుతారో తెలుసుకుందాం. అంతేకాకుండా, సూర్యుడు కర్కాటక రాశితో ప్రవేశం వలన మరికొన్ని రాశులకు శుభాలను కూడా తీసుకురాబోతున్నాడు. దీని వల్ల మీరు మీ ఉద్యోగం వ్యక్తిగత జీవితంలో ప్రయోజనం పొందే అవకాశాలున్నాయి. కానీ షడాష్టక యోగం కొన్ని రంగాలలో ప్రతికూల ఫలితాలను తీసుకురాబోతుంది. జూలై 15న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వివిధ రాశుల వారికి ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో తెలుసుకుందాం. ఏ రాశుల వారు సమస్యలను ఎదుర్కొబోతున్నారు.. కుంభ రాశి వారికి, సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం కొంచెం సవాలుగా ఉండబోతుంది. చేసే పనిలో గొడవలు జరిగే అవకాశాలున్నాయి. కొన్ని రకాల ప్రతికూలతలు మిమ్మల్ని వెంటాడుతాయి. మీ బాధ్యతలు మిమ్మల్ని నిద్రపోనివ్వవు. మకర రాశి వారికి, సూర్యుని సంచారం కొన్ని రకాల సంబంధిత సంఘర్షణలకు దారితీయవచ్చు. ఇది కుటుంబం, వ్యాపారంలో స్పష్టంగా కనిపించవచ్చు. ఎవరికీ లాభాలను అందించబోతున్నాడు.. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన మిథున, వృషభ, సింహ రాశులను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయానికొస్తే.. ఇది మీ సంబంధంలో భావోద్వేగ విభేదాలను సృష్టించవచ్చు. మిథున రాశి వారు ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడితే బెటర్. ఇది
మీకు వృత్తి, వ్యక్తిగత జీవితం రెండింటిలోనూ అభివృద్ధి చెందడానికి సహాయ పడుతుంది. వృషభ రాశి వారు తోబుట్టువులతో సమస్యలను ఎదుర్కోనే అవకాశాలున్నాయి. సింహ రాశి వారు వారి వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోనే అవకాశాలున్నాయి.
వృషభ సింహ రాశుల వారికి ప్రత్యేక యోగం ఉందా?
సింహ రాశి వారు ఉద్యోగ మార్పులుంటాయి. కార్యాలయాల్లో విభేదాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు జీవితంలో అనేక విషయాల పట్ల అప్రమత్తతో మెలగాలి. మీ ఖర్చులను నియంత్రించుకోండి. కర్కాటక రాశి వారు వ్యక్తిత్వ మార్పులు ఉద్యోగ లాభాలను అందుకుంటారు. వ్యాపారవేత్తలకు మంచి అవకాశాలు లభిస్తాయి. వృశ్చిక రాశి వారు కూడా సానుకూల ఫలితాలను అందుకోబోతున్నారు. ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీరు మీ కెరీర్లో కొత్త పుంతలు తొక్కే అవకాశాలున్నాయి. ఇది మీ కెరీర్‌కు సంబంధించి ప్రయోజనకరంగా ఉంటుంది.
Disclaimer (గమనిక): ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం లేదా ఖచ్చితమైనదని మేము చెప్పడం లేదు. ఇందులో చెప్పినట్టు ఈ రాశులపై ప్రభావం ఆయా వ్యక్తులు పుట్టిన సమయం ఆధారంగా మారుతూ ఉంటాయి. మరింత ఖచ్చితమైన సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలోని పండితులను సంప్రదించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.